Telugu Gateway
Andhra Pradesh

అరవై ఐదు వేల కోట్లలో సగం పనులు ఆ కంపెనీకే!

అరవై ఐదు వేల కోట్లలో సగం పనులు ఆ కంపెనీకే!
X

‘సిండికేట్’కు రింగ్ లీడర్ గా ఆ కంపెనీనే

ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కొత్త కొత్త ప్లాన్స్

ప్రభుత్వం ఏదైనా ఆ కంపెనీదే హవా. రాష్ట్రం ఏది అయినా..ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ సంస్థ ‘హవా’ను మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు. ఒకప్పుడు విమర్శలు చేసిన వారు కూడా అధికారంలోకి వచ్చాక సాగిలపడుతున్నారు. మరి ‘పవర్’లో ఉన్న వారు కూడా ఆ కంపెనీ ‘పవర్’ కు సరెండర్ అవుతూనే ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే ఏపీ సర్కారు త్వరలోనే 65 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్రంలోని రాయలసీమతోపాటు పలు ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు టెండర్లు పిలవటానికి రెడీ అవుతోంది. దీని కోసం స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీలు) ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టనున్నారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ల ‘డిజైన్’ అంతా ఆ సంస్థ కనుసన్నల్లోనే సాగుతోందని సాగునీటి కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

మరీ వివాదాలు లేకుండా చేసుకునేందుకు 65 వేల కోట్ల రూపాయల టెండర్లలో తమకు కావాల్సిన కాంపోనెంట్లు అన్నీ ఆ సంస్థే దక్కించుకునేందుకు వ్యూహాం ఖరారు అవుతోందని..65 వేల కోట్ల రూపాయల పనుల్లో సగం ఆ కంపెనీకే వెళ్ళేలా డిజైన్ చేస్తున్నారని సాగునీటి ప్రాజెక్టుల పనిలో ఎంతో అనుభవం ఉన్న సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ సంస్థ కూడా వివాదాల జోలికి వెళ్లకుండా తనకు కావాల్సిన కాంపోనెంట్స్ వరకే పరిమితం అయి మిగిలిన పనుల విషయంలో పట్టించుకోకుండా ఉండేందుకు సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీ సర్కారు ఓ వైపు 12300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వాటర్ గ్రిడ్ పనులు చేపట్టేందుకు రెడీ అయింది. నిధులు లేవని ఈ పనులను మాత్రం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) లో చేపట్టేందుకు రెడీ అయిన సర్కారు ...65 వేల కోట్ల రూపాయల పనులను మాత్రం రెగ్యులర్ టెండర్లే పిలవాలని యోచిస్తోందని చెబుతున్నారు.

ఎందుకంటే ఆ కీలక కాంట్రాక్ట్ సంస్థ యాన్యుటీకి ఆసక్తి చూపటంలేదని..పనులుచేసిన వెంటనే డబ్బులు వచ్చే మోడల్ కు ప్రాధాన్యత ఇవ్వటం వల్లే సర్కారు కూడా ఇదే మోడల్ కు అనుగుణంగా ముందుకెళుతోందని చెబుతున్నారు. నిజంగా నిధుల్లేని సమయంలో వెసులుబాటు కావాలనుకుంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ నే ఎంచుకునే వారని..కానీ ఏ పనికి ఏ మోడల్ లో వెళ్లాలి అనే విషయాన్ని కూడా ఆ కాంట్రాక్ట్ సంస్థే డిసైడ్ చేసే స్థితికి వచ్చిందని ఓ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. తక్కువ వ్యయంతో చేపట్టే వాటర్ గ్రిడ్ పనులు మాత్రం హ్యామ్ మోడల్ కు ఎంచుకుని ...ఏకంగా 65 వేల కోట్ల రూపాయల పనులకు మాత్ర రెగ్యులర్ టెండర్ల మోడల్ ను ఎంచుకోవటం వెనక ఆ కంపెనీదే ‘డిజైన్’ అని చెబుతున్నారు.

Next Story
Share it