Telugu Gateway
Politics

కెసీఆర్ ‘క్వారంటైన్ సీఎం’

కెసీఆర్ ‘క్వారంటైన్ సీఎం’
X

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలు ఇబ్బంది పడుతున్నా ఆయన ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటకు రారని వ్యాఖ్యానించారు. కెసీఆర్ కు ‘క్వారంటైన్ సీఎం’ పేరు బాగా సెట్ అవుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజలు, రైతులను కెసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. కోటి టన్నుల ధాన్యం సేకరిస్తా అన్న సీఎం ఇప్పటి వరకు 20 టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారన్నారు. ‘ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రికల్చర్ బులెటిన్ విడుదల చేస్తున్నాయి. మరి తెలంగాణ ఎందుకు చేయడం లేదు? దేశంలో 18 రాష్ట్రాల ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. సీఎం మీడియా సమావేశం పై ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు చేస్తుంటే సీఎం స్వీకరించడం లేదు. రాబోయే రోజుల్లో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానికి సరైన విధివిధానాలు లేవు. పంట కొనుగోళ్ల కోసం బోర్డులను ఏర్పాటు చేసి వెళ్లాలికాని వెళ్లడం లేదు. కమిషన్ కోసం ప్రభుత్వం కక్కుర్తి పడుతుంది-దళారుల రాజ్యం నడుస్తోంది.

సీఎం కేసీఆర్ కి దమ్ము దైర్యం ఉంటే కొనుగోళ్ల కేంద్రాలను పర్యటన చేయాలి. కేసీఆర్ కేబినెట్ లో ఒక్కో మంత్రి ఒక్కో మాట మాట్లాడుతారు. 464 కోట్లు కేంద్రం గిడ్డంగుల నిర్మాణం కోసం ఇచ్చింది. 22 లక్షల టన్నుల ధాన్యం వాటి వల్ల స్టోరేజ్ చేయొచ్చు. రైతుల పంటను నిల్వ చేసేందుకు ఎన్ని ఫంక్షన్ హాల్స్ బుక్ చేశారో చెప్పాలి?. మద్దతు ధర లేకున్నా పంట అమ్ముడు పోతే చాలు అన్నట్లు రైతు తయారు అయ్యారు. మంచి జరుగితే కేసీఆర్ పేరు- చెడు జరుగుతే కేంద్రం పై నెట్టేయడం అలవాటు అయింది. వైద్యులు టెస్టులు జరపండి అని వేడుకున్నా సీఎం పట్టించుకోవడం లేదు. ప్రజల ప్రాణాలను- మరణాలను కోరుకుంటుంది కేసీఆరే. సీఎం నిర్ణయాల వల్ల నిన్న మళ్ళీ హైదరాబాద్ లో కేసులు పెరిగాయి. టెస్టులు జరపాలి అని కేంద్రం అంటుంటే కేసీఆర్ మాత్రం తన పేరు కోసం టెస్టులను తగ్గించారు. గత నెల 24 నుంచి 28వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదికలో 26 ఉంటే- రాష్ట్ర నివేదికలో 25 మాత్రమే ఉన్నాయి. దొంగలకు అడ్డాగా మారుస్తున్న ఎంఐఎం కి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించడం బాధాకరం. దళిత మహిళ పై అసభ్యకరంగా వ్యవహరించినదుకు కేసులు పెట్టాలి. హనుమాన్ భక్తులు మాలవేసుకుంటే కేసులు పెట్టారు’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it