Telugu Gateway
Politics

చంద్రబాబు..గంటా రాజకీయ వ్యాపారులు

చంద్రబాబు..గంటా రాజకీయ వ్యాపారులు
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, గంటా శ్రీనివాస్ లు రాజకీయ వ్యాపారులు అని ఆరోపించారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే కనిపించడం లేదని, హ్యాండ్‌ కర్ఛీఫ్‌ మార్చినట్లు.. పార్టీ మార్చే వ్యక్తి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అని ఎద్దేవా చేశారు.

రెండు నెలల పాటు తెలంగాణలో మనవడితో ఆడుకున్న చంద్రబాబుకు స్వాగతం ఎందుకని అవంతి ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మద్యం అమ్మకాలు తగ్గిస్తే బ్రాండ్‌లు అమ్మడం లేదంటూ ఆయన రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదాయం కోసం జనానికి చంద్రబాబు మందు పోయించారని విమర్శించారు.

Next Story
Share it