Telugu Gateway
Andhra Pradesh

ఎల్ జీ పాలిమర్స్ సీజ్ కు హైకోర్టు ఆదేశం

ఎల్ జీ పాలిమర్స్ సీజ్ కు హైకోర్టు ఆదేశం
X

ఎల్ జీ పాలిమర్స్ ప్రమాద ఘటనకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ కమిటీలు తప్ప..ఎవరినీ కంపెనీలోపలికి అనుమతించవద్దని..ప్రమాదం జరిగిన యూనిట్ ను పూర్తిగా సీజ్ చేయాలని ఆదేశించింది. దీంతోపాటు కోర్టు ఆదేశాల వివరాలు ఇలా ఉన్నాయి. డైరెక్టర్ లతో సహా ఎవరు కంపెనీ లోపలకు అడుగు పెట్టాకూడదన్నారు. విచారణ కోసం ఏర్పాటు చేయబడ్డ కమిటీలు ప్లాంట్ ను సందర్శించి విచారణ చేసుకోవచ్చు కానీ కంపెనీ గేటు దగ్గర అ ఒక రిజిస్టర్ మెయింటెన్ చేసి అందులో వివరాలు నమోదు చేయాలి కంపెనీకి చెందిన ఎటువంటి ఆస్తులు ఫర్నిచర్ మెషినరీ ఇతర స్థిరచరాస్తులు కోర్టు అనుమతి లేనిదే తరలించ రాదు. కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి పోరాదు.’ అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు సమర్పించిన యాక్షన్ టేకెన్ రిపోర్టులో ఈ క్రింది విషయాలలో ఎందుకు మౌనంగా ఉన్నారు అని కోర్టు ప్రశ్నించింది.

ఎల్జీ పాలిమర్స్ పర్యావరణ అనుమతులు లేకుండా ఎలా పనిచేస్తుంది. అలారం ఎందుకు పని చేయలేదు చుట్టుపక్క ప్రజలకు ప్రమాదం జరిగినప్పుడు చిట్టు పక్కల ప్రదేశాలను ఖాళీ చేసేందుకు కావాల్సిన సమాచారాన్ని ట్రైనింగ్ అని ఎందుకు ఇవ్వలేదు. వీటి పై ప్రభుత్వ సంస్థలు సమయం అడుగగా సమయం ఇస్తూ కోర్టు ఈ కింది విషయాల పై కూడా సమాచారము ఇవాల్సిది గా ఆదేశించింది. బుక్ వాల్యూ ప్రకారం కాకుండా కంపెనీ చట్టం ప్రకారం ఎల్ జీ పాలీమర్స్ నికర విలువ ఎంత? స్టెరీన్ ని సౌత్ కొరియా కి ఎందుకు తరలించారు, అలా తరలించమని ఆదేశించిన వ్యక్తి ఎవరు? , నేరం జరిగినాక ఎటువంటి మాజిస్టీరియల్ విచారణ కానీ తనిఖీ టీం ఏర్పాటు కా కుండానే ఎలా తరలించారు వంటి అంశాలపై సమాధానాలు చెప్పాలని కోరింది. దీనికి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం సమయం కోరటంతో ఈ కేసును వాయిదా వేశారు.

Next Story
Share it