Telugu Gateway
Andhra Pradesh

డాక్టర్ సుధాకర్ దాడి ఘటనపై సీబీఐ విచారణ

డాక్టర్ సుధాకర్ దాడి ఘటనపై సీబీఐ విచారణ
X

విశాఖపట్నంలో సస్పెండ్ అయిన మత్తు డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి శుక్రవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు ఈ అంశంపై ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించింది. అంతే కాదు..ఎనిమిది వారాల్లో నివేదికను కోర్టు ముందు ఉంచాలన్నారు. ఈ వ్యవహారం సర్కారును ఇరకాటంలోకి నెట్టనుంది. ఇప్పటికే ఈ అంశంపై ఏపీలో పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. శుక్రవారం నాడు ఈ కేసు విచారణ సందర్బంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించింది. ‘డా.సుధాకర్‍ శరీరంపై గాయాలున్నాయని..మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో ఉంది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో డాక్టర్ సుధాకర్ గాయాల గురించి పేర్కొనలేదన్నారు. ప్రభుత్వ నివేదికను కోర్టు నమ్మడం లేదు. దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నాం. అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నాం’ అని తెలిపారు.

డాక్టర్ సుధాకర్ తొలుత నర్సీపట్నం ఆస్పత్రిలో వైద్యులకు మాస్క్ లు ఇవ్వటంలేదంటూ, తెలంగాణ సీఎం కెసీఆర్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ఆ తర్వాత ఏపీ సర్కారు ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా వివాఖపట్నంలో కారులో వచ్చి రోడ్డుపై హంగామా చేసి..సీఎం జగన్ ను కూడా అభ్యంతరకర భాషలో దుర్బాషలాడారు. ఆ సమయంలో పోలీసులు ఆయన చేతులను వెనక్కి కట్టేసి..బలవంతంగా తీసుకెళ్లటం దుమారం రేపింది. సుదాకర్ మానసిక పరిస్థితి బాగాలేదంటూ ఆయన ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత టీడీపి మహిళ నాయకురాలు అనిత హైకోర్టు లేఖ రాయటంతో సుమోటోగా హైకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించి..నివేదిక కోరటం..ఇప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించటం జరిగిపోయాయి.

Next Story
Share it