Telugu Gateway
Andhra Pradesh

పెట్టుబడుల ఆకర్షణకు ఏపీ టాస్క్ ఫోర్స్

పెట్టుబడుల ఆకర్షణకు ఏపీ టాస్క్ ఫోర్స్
X

కరోనా దెబ్బకు చైనా నుంచి ఖాళీ చేస్తున్న పలు కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక ప్రాతిపదికన పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఛైర్మన్ గా ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇందులో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు.

జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్,ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ , గనుల శాఖ కార్యరద్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులకు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో చోటు కల్పించారు. ఈ టాస్క్ ఫోర్స్ అవసరానికి అనుగుణంగా ఛైర్మన్ అనుమతితో పరిశ్రమ రంగానికి చెందిన సభ్యులను కో ఆప్ట్ చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెలకు ఓ సారి ఈ టాస్క్ ఫోర్స్ సమావేశం అయి పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది.

Next Story
Share it