హైకోర్టు ముందు హాజరైన ఏపీ సీఎస్
BY Telugu Gateway28 May 2020 1:04 PM IST

X
Telugu Gateway28 May 2020 1:04 PM IST
ఏపీలో ప్రభుత్వ భవనాలకు రంగుల వ్యవహారం దుమారం రేపుతూనే ఉంది. హైకోర్టులు ఈ అంశంలో జోక్యం చేసుకోవటంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోంది. ఇఫ్పటికే ఓ సారి సుప్రీంకోర్టు గడప తొక్కిన ఏపీ సర్కారు..రెండవ సారి కూడా ఇదే అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేదిలు హాజరయ్యారు. సీఎస్ కోర్టుకు ఈ అంశంపై వివరణ ఇఛ్చారు. సుప్రీంలో కేసు ఉన్నందున శుక్రవారం నాడు ఈ అంశంపై తిరిగి విచారణ చేపట్టాలని నిర్ణయించారు.
Next Story



