Telugu Gateway
Cinema

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు
X

టాలీవుడ్ నటి శ్రీ సుధ ప్రముఖ కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుపై ఫిర్యాదు చేశారు. తనను పెళ్ళి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్యామ్ కె నాయుడు ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు తమ్ముడు. నటి శ్రీసుధ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్యామ్ కె నాయుడిని విచారిస్తున్నారు.

శ్యామ్ కూడా ఫేమస్ కెమెరామెన్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పలు సినిమాలకు ఆయన కెమెరామెన్ గా పనిచేశాడు. తెలంగాణను కుదిపేసిన డ్రగ్స్ కేసులో కూడా శ్యామ్ కె నాయుడిని ఎక్సైజ్ శాఖ అధికారులు అప్పట్లో ప్రశ్నించినట్లు సమాచారం.

Next Story
Share it