Telugu Gateway
Cinema

ఆ కమెడియన్ నాతో అసభ్యంగా ప్రవర్తించారు

ఆ కమెడియన్ నాతో అసభ్యంగా ప్రవర్తించారు
X

ప్రగతి. టాలీవుడ్ లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆమె తాజాగా ఓ ఛానెల్ తో మాట్లాడుతూ ఓ సీనియర్ కమెడియన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా సెట్ లో ఆయన తనతో తప్పుగా ప్రవర్తించారని తెలిపారు. ఇప్పుడు ప్రగతి వ్యాఖ్యలు టాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి. ఆయన చర్యల వల్ల తనకు ఎంతో అసౌకర్యం కలిగిందని ఆమె పేర్కొన్నారు. ఆ కమెడియన్ తనకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసని..తొలుత తనతోమంచిగానే ఉన్నారని తెలిపారు. కానీ ఓ రోజు సినిమా సెట్ లో తప్పుగా ప్రవర్తించాడు. అంతే కాదు చాలా చీప్ గా మాట్లాడాడు. ఆయన ప్రవర్తన తనను షాక్ కు గురిచేసిందని అన్నారు.

ఆ సంఘటన జరిగిన రోజే సాయంత్రం ఆయనతో మాట్లాడుతూ సెట్ లో ప్రవర్తించిన తీరు ఏ మాత్రం సరిగాలేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. సెట్ లో వాడిన అసభ్యపదజాలం, ప్రవర్తించిన తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యంలేదని ఆయన కు చెప్పానని తెలిపారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఓ మహిళతో మిస్ బిహేవ్ చేసి కాళ్ళావేళ్ళా పడి తప్పించుకు వచ్చిన కమెడియనే ఈయన అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it