Telugu Gateway
Cinema

అవును...నిజంగానే సిగరెట్ కాల్చాను

అవును...నిజంగానే సిగరెట్ కాల్చాను
X

హరితేజ. పరిచయం అక్కర్లేని నటి. వెండితెరతోపాటు బుల్లి తెరపై సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆమె. లాక్ డౌన్ తో ఖాళీగా ఉన్న అందరూ సోషల్ మీడియాలో తమ అభిమానులతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను వెల్లడిస్తున్నారు. తాజాగా హరితేజ కూడా అలాగే పలు అంశాలపై స్పందించారు. ‘హిట్’ సినిమాలో తాను పాత్ర కోసం నిజంగానే సిగరేట్ తాగినట్లు ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నెకు సమాధానంగా చెప్పారు.

పాత్ర డిమాండ్ చేయటంతోనే ఆ పని చేసినట్లు తెలిపారు. ఓ నెటిజన్ 'మీ వయసు ఎంతో చెప్పగలరా?' అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన హరితేజ.. 'నేను చెప్పినా మీరు నమ్మరు.. నమ్మినా వినరు.. విన్నా అర్థం చేసుకోరు.. నిజాలు ఎప్పుడూ నిష్ఠూరంగా ఉంటాయి.. అయినా చెబుతా.. నేను పుట్టిన తేదీ.. 24-02-1992'అని వెల్లడించింది.

Next Story
Share it