వివాదస్పదం అయిన వైసీపీ ఎమ్మెల్యే రోజా తీరు
BY Telugu Gateway21 April 2020 2:03 PM IST

X
Telugu Gateway21 April 2020 2:03 PM IST
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అందరిలోనూ ఒకటే టెన్షన్. కరోనా మహమ్మారి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో అన్న భయం. ఈ తరుణంలో అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఈ మధ్య కాలంలో అనూహ్యంగా పెరిగింది. ఈ తరుణంలో నగరి ఎమ్మెల్యే రోజా వ్యవహరశైలి విమర్శల పాలైంది.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరు సుందరయ్యనగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రోజా వెళ్లారు. అక్కడే ఆమెకు ప్రజలు పూలతో స్వాగతం పలికారు. అక్కడి జనం పూలు నేలపై జల్లుతుంటే రోజా వాటిపై నడుచుకుంటూ వెళ్లడం దుమారం రేపుతోంది. అక్కడి ప్రజలు అడుగు అడుగుకూ పూలు నేలపై చల్లుతూ స్వాగతం పలికారు. కరోనా సమయంలో ఇంత ఆర్భాటం అవసరమా అన్న విమర్శలు వెల్లువెత్తాయి.
Next Story