Telugu Gateway
Andhra Pradesh

‘కరోనాపై మాస్క్ లు బ్రహ్మస్త్రం’ అంట!

‘కరోనాపై మాస్క్ లు బ్రహ్మస్త్రం’ అంట!
X

మాస్క్ మంచిదే. ఇందులో ఆక్షేపించాల్సింది కూడా ఏమీలేదు. వైరస్ వ్యాపించకుండా బయట తిరిగే వాళ్లందరూ మాస్క్ లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మాస్క్ ల కొరత కూడా తీవ్రంగా ఉంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ 16 కోట్ల మాస్క్ లు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో ఎక్కువ శాతం క్లాత్ మాస్క్ లే ఉండే అవకాశం ఉంది. అలాంటిది ఒక్కో వ్యక్తికి మూడు మాస్క్ లు అనటంలో ఎలాంటి లాజిక్ లేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మనిషికి రెండు మాస్క్ లు అంటే..ఒకటి ఉతికినా మరొకటి వాడుకోవచ్చు. ఈ లోగా రెండవది రెడీ అవుతుంది. ఇది ఎండాకాలమే కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇదిలా ఉంటే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మాస్క్ ల అంశంపై చేసిన ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. ‘ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని సిఎం జగన్ చూపిన మార్గానికి దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. 16 కోట్ల మాస్కుల పంపిణీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కరోనాపై బ్రహ్మస్త్రం ఇది. అతితక్కువ ప్రాణ నష్టంతో ఏపీ సేఫెస్ట్ ప్లేస్ అవుతుంది.’ అని పేర్కొన్నారు.

మాస్క్ లు కరోనాపై బ్రహ్మస్త్రం అనటం చూస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా ఓ ఫ్లూ లాంటిదే..ఇది క్యూరబుల్..పారాసిటమాల్ సరిపోతుంది అని చేసిన వ్యాఖ్యల తరహాలోనే ఉంది నిజంగా మాస్క్ లే కరోనాను నియంత్రించే బ్రహ్మస్త్రం అయితే ప్రపంచం అంతా ఇంత హైరానా పడటం ఎందుకు?.విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో మాస్క్ ల గురించి చేసిన ట్వీట్ తోపాటు టీడీపీ అదినేతత చంద్రబాబుపై వ్యంగాస్త్రాలు కూడా సంధించారు. ‘సెంట్రల్ కేబినెట్ సెక్రటరీకి ఫోన్ కలుపు, ఏపీ సిఎస్ ను మాట్లాడమను, హెల్త్ సెక్రటరీ రిపోర్టేదీ? తక్షణం మీడియా కాన్ఫరెన్సు అరేంజ్ చేయండి. చంద్రబాబు పలవరింతలివన్నీ. ఆయన మానసిక పరిస్థితి బాగా దిగజారిందంటున్నారు. కరోనా తీవ్రత తగ్గేలోగా సీరియస్ అవుతుందని టెన్షన్ పడుతున్నారట’ అంటూ మరో ట్వీట్ చేశారు. ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటుంది. ఎప్పుడే నిర్ణయం తీసుకోవాలో ఆ విచక్షణాధికారం ఉంటుంది. కరోనా నివారణ కోసం ఏ రాష్ట్రం అమలు చేయని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఎల్లో మీడియాకు, పచ్చ మేధావులకు ఇవేమీ కనిపించవు. నిమ్మగడ్డ పదవీకాలం ముఖ్యమైపోయింది వీళ్లకు. సిగ్గులేని బతుకులు.’ అంటూ మరో ట్వీట్ చేశారు.

Next Story
Share it