Telugu Gateway
Telangana

తెలంగాణలో కొత్త కేసులు14...జీహెచ్ఎంసీలోనే 12

తెలంగాణలో కొత్త కేసులు14...జీహెచ్ఎంసీలోనే 12
X

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 872కు పెరిగింది. సోమవారం నాడు కొత్తగా 14 పాజిటివ్ కేసులు రాగా..అందులో 12 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఒక కేసు మేడ్చల్ లో..మరో కేసు నిజామాబాద్ లో నమోదు అయ్యాయి. సోమవారం నాడు కరోనా కారణంగా ఇద్దరు చనిపోయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 663 ఉన్నాయి. సర్కారు తాజాగా లాక్ డౌన్ ను మే 7 వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

ఏ కారణంతో బయటకు వచ్చినా ఆయా వ్యక్తులు అడ్రస్ తో కూడిన కార్డులను తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. ఆస్పత్రులకు వెళ్లే వారు కూడా సంబంధిత రికార్డులను దగ్గర ఉంచుకోవాలని..సాధ్యమైనంత మేర సమీపంలో ఉన్న ఆస్పత్రులకే వెళ్ళాలని సూచించారు. కొన్ని పాస్ లు దుర్వినియోగం అవుతున్నాయని ఫిర్యాదు లు వచ్చాయని..అందుకని ఇక నుంచి రూట్ ను మెన్షన్ చేస్తూ పాస్ లు ఇవ్వనున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పాస్ ల విధానంలో మార్పు చేయనున్నట్లు వెల్లడించారు.

Next Story
Share it