Telugu Gateway
Telangana

తెలంగాణలో నిర్వహించిన కరోనా పరీక్షలు పది వేలు

తెలంగాణలో నిర్వహించిన కరోనా పరీక్షలు పది వేలు
X

కరోనా కేసుల సంఖ్య తెలంగాణలో ఏడు వందలకు చేరింది. ఇఫ్పటి వరకూ రాష్ట్రంలో పది వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కొంత మందికి జలుబు, దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలు ఏమీ లేకుండానే కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మర్కజ్ వెళ్లి వచ్చిన ఒక వ్యక్తి వల్ల 20మంది కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని మంత్రి తెలిపారు. గురువారం నాడు 68మందిని డిచార్జ్ చేస్తున్నామని తెలిపారు. కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. ఇందులో మెజారిటీ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయని తెలిపారు. తెలంగాణలోని కంటైన్మెంట్ జోన్ లపై ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టిందన్నారు. ప్లాష్మా థెరపీ చికిత్స కోసం ఐసీఎంఆర్ కు ఇప్పటికే లేఖ రాశామని ఈటెల వెల్లడించారు. మంత్రి గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో వైద్యులకు అన్ని రకాల సౌకర్యాలు కలిపిస్తున్నాం. మరో రెండు లాబ్ లకు కేంద్రం అనుమతి. ఈ రెండు లాబ్ లు 18వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తాం. మరో మూడు వారాల్లో అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులో ఉంటాయి. గచ్చిబౌలి హాస్పిటల్ ను ఈ నెల 20వ తేదీ ప్రారంభిస్తాం. 10లక్షల పీపీఈ కిట్స్- ఎన్95 మాస్క్ అందుబాటులోకి తెస్తున్నాం.

మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పీపీఈ కిట్స్ అండ్ ఎన్95 మాస్క్ లు సరఫరా చేస్తాం. గాంధీలో పాజిటివ్ వచ్చిన వారికే చికిత్స చేస్తున్నాం. ఇవాళ్టి వరకు 700 కేసులు నమోదు అయ్యాయి. కొంత మంది సరైన సౌకర్యాలు లేవు అని ఆరోపణలు చేస్తున్నారు. ఇండోనేషియా వాళ్ళు కరీంనగర్ లో ఇంటి ఇంటికి తిరిగినా కరోనా సోకలేదు. అధికారుల వ్యూహం వల్ల కరోనా స్ప్రెడ్ కాలేదు. కరీంనగర్ తరహాలో హైదరాబాద్ లో కరోనా నివారణ చర్యలు తీసుకుంటాం. మర్కజ్ వెళ్లిన వాళ్ళు బాధ్యతతో ప్రభుత్వానికి సహకరించాలి. మర్కజ్ వెళ్లిన వాళ్ళు ఇంకా ఉన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళతో కలిసిన వాళ్ళు వైద్యులను కలవాలి’ అని ఈటెల కోరారు.

Next Story
Share it