Telugu Gateway
Telangana

తెలంగాణలో మే 7 వరకూ లాక్ డౌన్ పొడిగింపు

తెలంగాణలో మే 7 వరకూ లాక్ డౌన్ పొడిగింపు
X

కేంద్రం సడలింపులు రాష్ట్రంలో అమలు చేయటం లేదు

మే1 నాటికి కేసులు తగ్గొచ్చు

కొత్తగా 18 కేసులు..మొత్తం 858

తెలంగాణలో మే7 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలే అమల్లో ఉంటాయని..ఇందులో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపారు. పలు సర్వేల్లోనూ ప్రజలు లాక్ డౌన్ ను పొడిగించాలనే కోరారని తెలిపారు. కొంత మంది అవసరం అయితే మే నెలాఖరు వరకూ అయినా లాక్ డౌన్ కొనసాగించాలని సూచించారన్నారు. కేంద్రం మే 20 నుంచి ఇచ్చిన సడలింపులు ఏవీ రాష్ట్రంలో అమలు కావన్నారు. మే 1 నాటికి కరోనా కేసులు తగ్గొచ్చని ఆశిస్తున్నట్లు..తగ్గాలని అందరం భగవంతుడిని ప్రార్ధించాలని అన్నారు. మే 7 వరకూ హైదరాబాద్ లో విమాన సర్వీసులు కూడా అనుమతించే ఛాన్స్ లేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, వైరస్ వ్యాప్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆదివారం నాడు కొత్తగా 18 పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 858కు చేరాయన్నారు. తెలంగాణలో మరణాలు 21 కు చేరాయన్నారు. 186 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్ళకు వెళ్ళారని తెలిపారు. ప్రస్తుతం 651 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రంజాన్ తో సహా ఎవరైనా అందరూ పండగలు ఇళ్లలోనే చేసుకోవాలని..ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండబోవన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే కరోనా కేసుల రెట్టింపు దేశంలో ఎనిమిది రోజుల కంటే తక్కువ ఉండగా..తెలంగాణలో పది రోజుల తర్వాతే రెట్టింపు అవుతున్నాయని తెలిపారు. మరణాలు రేటు జాతీయ సగటు 3.22 శాతం ఉంటే..తెలంగాణలో 2.44 శాతం ఉందన్నారు. రికవరి జాతీయ సగటు 14 శాతం అయితే..తెలంగాణలో 22 శాతం ఉందని కెసీఆర్ తెలిపారు. పరీక్షల విషయంలో దేశ సగటు కంటే తెలంగాణ చాలా ముందు ఉందన్నారు.

తెలంగాణలో స్విగ్గీ, జొమాటో సేవలను అనుమతించబోమని అన్నారు. కేవలం కిరాణా సరులు తెచ్చేవారికి తప్ప ఎవరికీ అనుమతి లేదన్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎవరూ అద్దె కట్టాల్సిన అసవరం లేదని, ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎవరైనా డిమాండ్ చేస్తే 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని..ఇది ప్రభుత్వ ఆర్డర్ అని తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థలు 2020-21 విద్యా సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా ఫీజులు పెంచటానిక వీల్లేదని..ఇది ప్రభుత్వ ఆదేశం అని కెసీఆర్ తెలిపారు. నెల వారీగా ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని..అంతకు మించి రూపాయి కూడా అదనంగా తీసుకోవటానికి వీల్లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారి అనుమతులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. పేదలకు మే నెలలో కూడా మనిషికి 12 కిలోల బియ్యం ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు 1500 రూపాయల నగదు కూడా అందిస్తామని తెలిపారు.

Next Story
Share it