Telugu Gateway
Telangana

తెలంగాణ కేబినెట్ ఏప్రిల్ 19న

తెలంగాణ కేబినెట్ ఏప్రిల్ 19న
X

లాక్ డౌన్ మినహాయింపులు ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానున్న తరుణంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఏప్రిల్ 19న జరగనుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో ఆ రోజుకు తెలంగాణలో ఉండే కరోనా కేసులు..పరిస్థితిని సమీక్షించి మినహాయింపుల విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం ఇచ్చిన మినహాయింపుల ప్రకారమే ముందుకు వెళ్లాలా?. లేక రాష్ట్రంలోని పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలా అనే అంశంపై మంత్రివర్గ సమావేశంలో ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణ సర్కారు ఇప్పటికే ఏప్రిల్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటే..ప్రధాని మోడీ మాత్రం లాక్ డౌన్ ను మే 3 వరకూ ప్రకటించారు. ఈ నెల 20 వరకూ లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయనున్నట్ల కెసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 650కి చేరింది. బుధవారం నాడు కొత్తగా ఆరు కేసులు వచ్చాయి.

Next Story
Share it