తెలంగాణలో మళ్ళీ పెరిగిన కేసులు
BY Telugu Gateway30 April 2020 9:18 PM IST

X
Telugu Gateway30 April 2020 9:18 PM IST
గత రెండు రోజులుగా అతి తక్కువ కేసులు నమోదు అయిన తెలంగాణలో మళ్లీ కేసులు ఒకింత పెరిగాయి. వరస రెండు రోజులు ఏడు లెక్కనే కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. గురువారం నాడు మాత్రం కొత్తగా 22 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1038కి పెరిగింది. అదే సమయంలో గురువారం నాడు ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 568 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మళ్లీ రాష్ట్రంలో కరోనా కేసులు పెరగటంతో సీఎం కెసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు పెరగకుండా..వ్యాప్తి చెందకుండా చూడాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కంటైన్మెంట్ ప్రాంతాల్లో మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
Next Story



