Telugu Gateway
Cinema

మహేష్ బాబు పది కోట్ల వ్యూస్ ‘రికార్డు’

మహేష్ బాబు పది కోట్ల వ్యూస్ ‘రికార్డు’
X

మహేష్ బాబు సినిమా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో వంద మిలియన్ల వ్యూస్ సాధించిన సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డు నమోదు చేసిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మాణ సంస్థగా ఉన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, శృతిహాసన్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించారు.

ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్‌ తో వచ్చిన ఈ మూమీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 2015లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు టీవీల్లో ప్రసారమైంది. అయితే కేవలం యూట్యూబ్‌లో 10 కోట్లకు పైగా మంది వీక్షించడం విశేషం. మామూలుగా తెలుగు సినిమా హిందీలో డబ్‌ అయితేనే ఇన్ని వ్యూస్‌ వస్తాయి. కానీ ఓ తెలుగు సినిమాకు ఏకంగా ఇన్ని వ్యూస్‌ రావడం ‘శ్రీమంతుడు’కే దక్కిందని చెబుతున్నారు.

Next Story
Share it