Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో కోవిడ్19 కేసులు@1016..శ్రీకాకుళంలోనూ కరోనా

ఏపీలో కోవిడ్19 కేసులు@1016..శ్రీకాకుళంలోనూ కరోనా
X

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 61 పాజిటివ్ కేసులు రావటంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1016కు పెరిగింది. కొత్తగా కృష్ణా జిల్లాలో ఏకంగా 25 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలులో14 కేసులు రాగా, గుంటూరులో మాత్రం ఒకింత తగ్గుముఖం పట్టి కేవలం 3 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురంలో ఐదు, కడపలో నాలుగు, నెల్లూరులో నాలుగు, శ్రీకాకుళంలో మూడు కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటివరకూ కరోనా జాడలేని శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి మూడు కేసులు నమోదు కావటం కలకలం రేపుతోంది. తాజా కేసులతో కలుపుకుని కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 275కు పెరిగింది. గుంటూరులో 209, కృష్ణాలో 127 కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ 171 మంది డిశ్చార్జి కాగా, మరణించిన వారి సంఖ్య 31కి చేరింది. గత 24 గంటల్లో 6928 శాంపిళ్ళను పరీక్షిస్తే 61 మంది కొవిడ్ 19 పాజిటివ్ గా తేలినట్లు హెల్త్ బులెటిన్ లో తెలిపారు.

Next Story
Share it