Telugu Gateway
Politics

ప్రతి కుటుంబానికి రూ 7500..సోనియా డిమాండ్

ప్రతి కుటుంబానికి రూ 7500..సోనియా డిమాండ్
X

భారత్ కరోనా టెస్ట్ ల విషయంలో ఇంకా వెనకబడే ఉందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. వైద్య సిబ్బందికి ఇంకా పీపీఈ కిట్ల కొరత ఉందని ఆరోపించారు. ట్రేసింగ్, టెస్టింగ్, క్వారంటైన్ మార్గాలను అమలు చేయటం తప్ప కరోనా నియంత్రణకు మరో మార్గంలేదని వ్యాఖ్యానించారు. ఆమె అధ్యక్షతన గురువారం నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె బిజెపిపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. కరోనా పేరుతో బీజేపీ ద్వేషము, మతతత్వం అనే వైరస్‌లను వ్యాపింప చేస్తోందని ఆరోపించారు.

ఫస్ట్ లాక్‌డౌన్‌తో 12 కోట్ల మంది నిరుద్యోగులయ్యారని చెప్పిన ఆమె ప్రతి కుటుంబానికి కేంద్రం 7500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా రైతులు, వలస కార్మికులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. కరోనా కట్టడికి యత్నిస్తోన్న డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు అభినందనీయులని సోనియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన సూచనలను కేంద్రం పట్టించుకోవటంలేదని ఆమె ఆక్షేపించారు.

Next Story
Share it