ఏపీకి రిలయన్స్ ఐదు కోట్ల విరాళం
BY Telugu Gateway14 April 2020 8:35 PM IST

X
Telugu Gateway14 April 2020 8:35 PM IST
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనాపై పోరుకు ఏపీకి ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేసింది. ఈ మొత్తాన్ని సంస్థ ఆన్ లైన్ ద్వారా సీఎంఆర్ఎఫ్ కు బదిలీ చేసింది. ఇప్పటికే రిలయన్స్ పీఎం కేర్స్ కు 400 కోట్ల రూపాయల విరాళం అందించి..సొంతంగా వంద కోట్ల రూపాయలతో పలు రకాల కార్యకలాపాలు తలపెట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా తెలంగాణకు కూడా ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఏపీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేయటంపై సీఎం జగన్ స్పందించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సాయాన్ని ప్రశంసిస్తూ కంపెనీకి జగన్ లేఖ రాశారు. ఈ నిధులు కరోనాపై పోరుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
Next Story