Telugu Gateway
Politics

సోనియా.. మమతలకు ప్రధాని మోడీ ఫోన్

సోనియా.. మమతలకు ప్రధాని మోడీ ఫోన్
X

కరోనా నివారణ కోసం దేశంలో చేపడుతున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు పలువురు కీలక నేతలతో చర్చించారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులతోపాటు దేశంలోని కీలక నేతలతో మాట్లాడారు. మోడీ ఫోన్ చేసిన వారిలో ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్ తోపాటు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్ డి దేవేగౌడలు ఉన్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి..వీటి నివారణ కోసం చేపట్టిన చర్యలను ప్రధాని వారికి వివరించారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కెసీఆర్, డీఎంకె అధినేత ఎం కె స్టాలిన్, పంజాబ్ కు చెందిన సీనియర్ నేత ప్రకాష్ సింగ్ బాదలతో కూడా మోడీ ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించారు.

Next Story
Share it