Telugu Gateway
Cinema

పాయల్ రాజ్ పుత్...పేపర్ డ్రెస్

పాయల్ రాజ్ పుత్...పేపర్ డ్రెస్
X

కరోనా దెబ్బకు ప్రస్తుతం అందరూ ఖాళీనే. అందుకే ఇంట్లో కూర్చుని రకరకాల పనులు చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే ఏదో ఒకటి చేస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టస్తున్నారు. ఆ సెలబ్రిటీలపై కొందరు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే..మరికొంత మంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. హీరోయిన్లు చాలా మంది తాము ఖాళీ సమయంలో ఎలా ఎక్సర్ సైజ్ లు చేస్తున్నదీ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఈ ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మరికొంత మంది సందేశాలు ఇస్తున్నారు.

టాలీవుడ్ లో ఎంట్రీ ఎంట్రీతోనే తన హాట్ హాట్ అందాలతో యూత్ ను ఆకట్టుకున్న భామ పాయల్ రాజ్ పుత్. ఇప్పుడు ఆమె తన ఒళ్ళంతా పేపర్ చుట్టేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పేపర్ డ్రెస్ తో ఫోటోలు దిగింది. న్యూప్‌పేప‌ర్స్‌ నే డ్రెస్‌గా చుట్టుకొని ఫోటోలు పోస్ట్ చేసింది. కొంద‌రు పాయ‌ల్ క్రియేటివిని పొగుడుతుంటే మ‌రొకొంద‌రు మాత్రం పాయ‌ల్ డ్రెస్సింగ్‌పై మీమ్స్ చేస్తూ, తెగ ట్రోల్ చేస్తున్నారు.

Next Story
Share it