Telugu Gateway
Politics

కేంద్రం కీలక నిర్ణయం

కేంద్రం కీలక నిర్ణయం
X

కరోనా దెబ్బ అందరిపై పడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో కోతలు పెడుతూ సగం సగం జీతాలు చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తాలను పరిస్థితి మెరుగుపడిన తర్వాత చెల్లిస్తామని చెబుతున్నారు. ఈ తరుణంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ దెబ్బకు కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీ ఎత్తున గండిపోతుంది. అదే సమయంలో కరోనా కారణంగా పలు రంగాలను ఆదుకునేందుకు ప్యాకేజీలు ప్రకటించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై పడింది.

ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంచరాదని నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటి నుంచి పెండింగ్ ఉన్న మొత్తాన్ని కూడా చెల్లించరు. దీని ప్రకారం 2021 జులై వరకూ డిఏ, డీఆర్ పెరగదు. ఆర్ధిక వ్యవస్థ కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు సూచిస్తున్న తరుణంలో డిఏ పెంచరాదని కేంద్రం నిర్ణయించింది. ఆర్ధిక రంగానికి సంబంధించి కేంద్రం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించారు.

Next Story
Share it