Telugu Gateway
Politics

కుమారస్వామి తనయుడి పెళ్లి వివాదం

కుమారస్వామి తనయుడి పెళ్లి వివాదం
X

ప్రపంచం అంతా కరోనా టెన్షన్ లో ఉంది. కానీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ నిబంధనలను ఉల్లంఘించి మరీ పెళ్ళి చేసుకోవటం ఇప్పుడు ఓ పెద్ద వివాదంగా మారింది. కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతి పెళ్లిల పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఒక్కసారిగా దుమారం మొదలైంది. అంతా లాక్ డౌన్ లో ఉంటే..ఇఫ్పుడు ఈ పెళ్ళి హంగామా ఏంటి?.అయినా కనీస జాగ్రత్తలు పాటించకుండా ఇలా చేస్తారా? అనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ పెళ్లి హంగామాపై ప్రముఖ నటి రవీనా టండన్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిఖిల్ పెళ్లి వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప విచారణకు ఆదేశించారు. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు కావటంతో నిఖిల్ పెళ్లికి వంద మందికిపైగా ప్రముఖులు హాజరైననట్లు చెబుతున్నారు.

అంతే కాకుండా పెళ్లికి పెద్ద ఎత్తున బంధువులు, సన్నిహితులు హాజరవటం ఒకెత్తు అయితే...ఎవరూ భౌతిక దూరం పాటించకుండా గుమిగూడి పెళ్లిని వీక్షించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అందులో ఎవరూ కనీస జాగ్రత్తల కోసం మాస్క్ లు కూడా ధరించినట్లు ఎవరూ కన్పించరు. ఈ వ్యవహారంపై సర్కారు కలెక్టర్‌, ఎస్పీల నుంచి నివేదిక కోరారు. వ్యవస్థను అపహాస్యం చేసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇందులో రెండో ఆలోచనకు తావులేదన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామికి నిబంధనలు పాటించాలన్న విచక్షణ లేకపోవడం దారుణమని విమర్శించారు.

Next Story
Share it