Telugu Gateway
Telangana

తెలంగాణలో కొత్తగా 40 కరోనా కేసులు..మొత్తం 404

తెలంగాణలో కొత్తగా 40 కరోనా కేసులు..మొత్తం 404
X

మంగళవారం నాడు ఒక్క రోజే తెలంగాణలో 40 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 404కు పెరిగింది. ఇప్పటివరకూ 45 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మరో 11 మంది మరణించారు. ప్రస్తుతం 348 మందికి కరోనా నుంచి కాపాడేందుకు చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని 1500 పడకల ఆసుపత్రిగా మార్చినట్లు మంత్రి వెల్లడించారు. మరో మంత్రి కెటీఆర్ తో కలసి ఈటెల అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.సీఎం కెసీఆర్ ఆదేశాల మేరకు స్డేడియాన్ని ఆస్పత్రిగా మార్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటే అన్నింటిలోనూ కరోనా చికిత్స కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కరోనా పాజిటివ్ పేషెంట్లకు చికిత్స అందించేందుకు డాక్టర్లకు అవసరమైన పీపీఈ కిట్స్, ఎన్ 95 మాస్క్ లను లక్షల సంఖ్యలో సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. దాతలు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారని తెలిపారు.

భారత్ వంటి దేశంలో కరోనా ను అరికట్టాలంటే భౌతికదూరం పాటించటం ఒకటే మార్గమని తెలిపారు. అందుకే లాక్ డౌన్ పొడిగించాలని కెసీఆర్ భావిస్తున్నారని వెల్లడించారు దుష్టులకు దూరంగా ఉండాలన్నట్లే..దుష్టశక్తి అయిన కరోనాకు కూడా దూరంగా ఉండాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో హైదరాబాద్ లోనే అత్యధికంగా 150 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 21 మంది డిశ్చార్జి అయితే నికరంగా 129 మంది చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ తర్వాత అత్యధిక కేసులు ఉన్న జిల్లా నిజామాబాద్. ఇక్కడ 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వరంగల్ అర్భన్ లో 23, జోగులాంబ జిల్లాలో22 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

Next Story
Share it