Telugu Gateway
Cinema

క్రేజీ కాంబినేషన్..రాజమౌళి..మహేష్ బాబుల మూవీ

క్రేజీ కాంబినేషన్..రాజమౌళి..మహేష్ బాబుల మూవీ
X

దర్శక దిగ్గజం రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ కాంబినేషన్ కలిస్తే ఎలా ఉంటుంది?. అవును. నిజమే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. ఇది ఇప్పుడు అధికారికం. ఈ వార్త మహేష్ బాబు ఫ్యాన్స్ కు పెద్ద పండగ లాంటిదే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెరకెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే వెల్లడించారు. ఈ సినిమాకు నిర్మాతగా కే ఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. అయితే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ఓ జోనర్ లో ఉండబోతుంది..కథ ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్ఆర్ఆర్ చారిత్రక నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు యువకులుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారు అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే.

మరి మహేష్ బాబు కోసం ఎలాంటి కధ సిద్ధం చేశారన్నది వేచిచూడాల్సిందే. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల వచ్చే ఏడాది సంక్రాంతికి. అంటే మహేష్ బాబు , జక్కన్న ల సినిమా ప్రారంభం అయ్యేది 2021లోనే అన్నది స్పష్టం అవుతోంది. మహేష్ బాబు తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టిన సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా పట్టాలెక్కే నాటికి మహేష్ బాబు మరో సినిమాను పూర్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజమౌళి, మహేష్ బాబుల కాంబినేషన్ లో ఇది తొలి సినిమా కావటం విశేషం.

Next Story
Share it