Telugu Gateway
Cinema

‘ఆచార్య’లో మహేష్ అవాస్తవం

‘ఆచార్య’లో మహేష్ అవాస్తవం
X

మెగాస్టార్ చిరంజీవి అసలు విషయం తేల్చేశారు. గత కొంత కాలంగా వస్తున్న పుకార్లలో ఏ మాత్రం వాస్తవంలేదని స్పష్టం చేశారు. ఆచార్య సినిమాలో మహేష్ బాబు నటించబోతున్నట్లు సోషల్ మీడియాతోపాటు పలు వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో అర్ధం కావటంలేదని చిరంజీవి వ్యాఖ్యానించారు. అయితే మహేష్ బాబు తనకు కొడుకులాంటి వాడని..అతనితో కలసి నటించే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా సినిమా చేస్తానన్నారు. అదే సమయంలో మహేష్ బాబుకు కూడా తానంటే ఎంతో అభిమానం ఉందని వ్యాఖ్యానించారు.

ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాశారు. ఆచార్య సినిమాలో ఓ పాత్రకు ముందునుంచి రామ్ చరణ్ అయితే బాగుంటుందని దర్శకుడు కొరటాల అభిప్రాయపడుతున్నారని... ప్రస్తుతం చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్నందున డేట్స్ సర్దుబాటు కావటం కష్టమేనన్నారు. అయితే ఈ విషయంలో దర్శకులు రాజమౌళి, కొరటాల కలిసి చర్చించి ఒక ఒప్పందానికి వస్తే 'ఆచార్య'లో చరణ్ ఉండొచ్చుని తెలిపారు. దీంతో గత కొన్ని రోజులుగా మహేష్ బాబు ఆచార్యలో నటిస్తున్నారంటూ వచ్చిన పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది.

Next Story
Share it