కర్నూలులో మరో నలభై కరోనా కేసులు
BY Telugu Gateway28 April 2020 12:07 PM IST

X
Telugu Gateway28 April 2020 12:07 PM IST
ఇరవై నాలుగు గంటల్లో వచ్చిన కేసులు ఇవి. మంగళవారం నాడు ఏపీలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..అందులో నలభై కేసులు ఒక్క కర్నూలు జిల్లాలోనే ఉండటం విశేషం. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1259కు పెరిగాయి. ఇందులో ఇఫ్పటికే 258 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 970 మందికి చికిత్స అందిస్తున్నారు తాజాగా వచ్చిన 40 కేసులతో కలుపుకుంటే కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 332కు పెరిగింది.
రాష్ట్రంలో అత్యధిక కేసులు ఉన్నది ఇక్కడే. కొత్తగా గుంటూరు జిల్లాలో 17, కృష్ణాలో 13, నెల్లూరులో 3,కడపలో 7, అనంతపురం, చిత్తూరుల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 5783 మంది శాంపిల్స్ ను పరీక్షించినట్లు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. కోవిడ్ ఆస్పత్తుల్లో పనిచేయటానికి 1170 మంది డాక్టర్లను కొత్తగా నియమించినట్లు తెలిపారు.
Next Story