Telugu Gateway
Cinema

క్రాక్ లో ‘సముద్రఖని’ ఫస్ట్ లుక్

క్రాక్ లో ‘సముద్రఖని’ ఫస్ట్ లుక్
X

రవితేజ, శృతిహాసన్ జంటగా నటిస్తున్న సినిమా ‘క్రాక్’. ప్రస్తుతం కరోనా దెబ్బకు షూటింగ్ లు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. కానీ క్రాక్ చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న సముద్రఖనికి సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఆయన పుట్టిన రోజును పురస్కరించకుని ఈ లుక్ ను విడుదల చేశారు. లాక్‌డౌన్‌ తర్వాత జరిపే చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ముగుస్తుంది. క్రాక్ సినిమా సముద్రఖని కటారి పాత్రలో నటిస్తున్నారు. ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో సముద్రఖని ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.

Next Story
Share it