Telugu Gateway
Cinema

త్వరలో కీర్తిసురేష్ పెళ్లి!

త్వరలో కీర్తిసురేష్ పెళ్లి!
X

జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహిత, ప్రముఖ నటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. మహానటి సినిమాలో ఆమె తన నటతో ఓ రేంజ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. తర్వాత కమర్షియల్ చిత్రాలు చేస్తూ ఉన్న ఈ కేరళ కుట్టి పెళ్లికి ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయని..ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే అని చెబుతున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలోనూ వార్తలు వెలువడ్డాయి. అయితే కీర్తి సురేష్ పెళ్లిపై కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఇంత వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఒక ప్రముఖ బీజేపీ నాయకుడి కుమారుడిని కీర్తి సురేష్‌ పెళ్లాడబోతుందని సమాచారం.

ఈ ఏడాది చివరిలో వీరి వివాహానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రముఖ పాత్రికేయుడు, నటుడు ఫూల్‌వాన్‌ రంగనాథన్‌ ఒక మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు కుకునూర్‌ నగేశ్‌ తొలిసారి తెలుగులో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాఫ్‌ సినిమాలో ప్రస్తుతం కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. 'గుడ్‌ లక్‌ సఖి' అనే పేరును వస్తున్న ఈ సినిమాలో కీర్తి డీ- గ్లామర్‌ పాత్రలో కనిపించనున్నారు.

Next Story
Share it