Telugu Gateway
Politics

నిర్ణయం మార్చుకున్న కెసీఆర్

నిర్ణయం మార్చుకున్న కెసీఆర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తన నిర్ణయం మార్చుకున్నారు. కరోనా వైరస్ అరికట్టే క్రమంలో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పనిచేస్తున్న వైద్య, పోలీసు సిబ్బందికి పూర్తి స్థాయి వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్ డౌన్ తో ఆదాయం తగ్గిపోయిందని..అందుకే ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కష్టకాలంలో ఎంతో కష్టించి పనిచేస్తున్న వైద్యులతోపాటు ఆ శాఖకు చెందిన సిబ్బంది, పోలీసుల వేతనాల కోతపై విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో కెసీఆర్ తన నిర్ణయాన్ని సమీక్షించుకుని పూర్తి స్థాయి వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు ఈ రెండు శాఖలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కెసీఆర్ తాజా నిర్ణయంపై పలు వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. మిగిలిన వాళ్లకు పూర్తి స్థాయి జీతాలు అందకపోవటం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నా కూడా..ఈ సంక్లిష్ట సమయంలో కెసీఆర్ వైద్యుల, పోలీసులను మినహాయించం సముచితమై నిర్ణయంగా చెప్పొచ్చు.

Next Story
Share it