Telugu Gateway
Politics

లైట్లు ఆగాయి...దీపాలు వెలిగాయి

లైట్లు ఆగాయి...దీపాలు వెలిగాయి
X

ఆదివారం రాత్రి తొమ్మిది గంటలు. దేశంలోని ప్రతి ఇంట్లో ఒకేసారి విద్యుత్ లైట్లు ఆగిపోయాయి. దీపాలు వెలిగాయి. తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకూ ఈ దీపాల వెలుగులో దేశమంత ఒక్కటై నిలిచింది. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అందరూ ఈ దీపాల ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఇఛ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కరోనాపై పోరులో భాగంగా దీపోత్సవంలో భాగస్వాములు అయ్యారు.

భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు కూడా కొవ్వొత్తులతో మోడీ పిలుపులో భాగస్వాములు అయ్యారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు అందరూ దీపాలు వెలిగించి కరోనాపై పోరులో తామంతా ఒకటై అని నినదించారు. పలు చోట్ల ప్రజలు గో కరోనా..గో కరోనా అంటూ నినాదాలు చేశారు.

Next Story
Share it