‘వకీల్ సాబ్’ పై క్లారిటీ ఇచ్చిన శ్రుతిహాసన్
BY Telugu Gateway11 April 2020 5:47 PM IST

X
Telugu Gateway11 April 2020 5:47 PM IST
పవన్ కళ్యాణ్, శృతిహాసన్ జంటగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ రాలేదు. కానీ తాజాగా వకీల్ సాబ్ లో ఓ పాత్రకు శృతిహాసన్ ను తీసుకున్నారని..మరోసారి వెండితెరపై పవన్ కళ్యాణ్, శృతిహాసన్ కన్పించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై శృతిహాసన్ క్లారిటీ ఇఛ్చారు. తాను వకీల్ సాబ్ లో నటించటంలేదని..ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవంలేదని ఆమె తేల్చిచెప్పారు. రూమర్స్ పై తాను మాట్లాడదలచుకోలేదన్నారు.
Next Story