Telugu Gateway
Andhra Pradesh

గుంటూరులో కరోనా కేసులు109

గుంటూరులో కరోనా కేసులు109
X

ఏపీలో వంద కేసులు దాటిన జిల్లాగా గుంటూరు నిలిచింది. ఇక్కడ కేసుల సంఖ్య 109కు పెరిగింది. ఒక్క మంగళవారం నాడే జిల్లాలో కొత్తగా 16 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. సోమవారం రాత్రి ఐదు గంటల నుంచి మంగళవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 34 కేసులు వచ్చాయి. ఇందులో గుంటూరులో 16, కృష్ణాలో 8, కర్నూలులో 7, అంతపురంలో 2, నెల్లూరులో ఒక కేసు నమోదు అయ్యాయి. కొత్తగా వచ్చిన 34 కేసులతో కలపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 473కు పెరిగింది.

ఇందులో 14 మంది డిశ్చార్జి కాగా, మరో తొమ్మిది మరణించారు. గత 24 గంటల్లో ఏపీలో 2010 శాంపిల్స్ ను పరీక్షించినట్లు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 450గా ఉంది. గుంటూరు జిల్లా తర్వాత 91 కేసులతో కర్నూలు జిల్లా రెండవ స్థానంలో ఉంది.

Next Story
Share it