Telugu Gateway
Politics

ముఖ్యమంత్రులకు మోడీ ‘త్రిసూత్రాలు’

ముఖ్యమంత్రులకు మోడీ ‘త్రిసూత్రాలు’
X

దేశంలోని అన్ని ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో ప్రధాని నరేంద్రమోడీ సూచించిన త్రిసూత్రాలు సూచించారు. అవేంటి అంటే కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించటం (టెస్టింగ్). కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించటం (ట్రేసింగ్). మూడవది అనుమానితులను ఏకాంత ప్రదేశాల్లో (ఐసోలేషన్) ఉంచటం అని సూచించారు. ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన పరిణామాల తర్వాత ఈ అంశాలపై ఫోకస్ పెట్టాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో కరోనాపై పోరుకు దేశంలోని రాష్ట్రాలు అన్నీ కలసి చేస్తున్న పోరు ప్రశంసనీయం అని మోడీ పేర్కొన్నారు. కరోనా నియంత్రణ కోసం ఎన్టీవోలతోపాటు సామాజిక సంస్థల సాయం తీసుకోవాలని సూచించారు. కరోనాపై పోరుకు చేస్తున్న కృషికి సహకరిస్తున్న వారందరికీ మోడీ కృతజ్ణతలు తెలిపారు.

దీంతోపాటు ఏప్రిల్ 14తో దేశంలో లాక్ డౌన్ పూర్తి కానున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై కూడా ప్రధాని మోడీ దేశంలోని ముఖ్యమంత్రులతో చర్చించారు. దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. సీఎంలతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. మెజార్టీ ముఖ్యమంత్రులు కూడా దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేతే సరైన నిర్ణయంగా అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఏప్రిల్ 14న లాక్‌డౌన్ గడువు ముగిసే రోజు ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో వెల్లడించనున్నట్లు సమాచారం.

Next Story
Share it