Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు పీఏపై కేసు నమోదు

చంద్రబాబు పీఏపై కేసు నమోదు
X

వైసీపీ నేత ఫిర్యాదు మేరకు తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు పీఏ మనోహర్ పై కేసు నమోదు అయింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, బ్యాంక్‌ నుంచి డబ్బులు తీసుకున్నారంటూ మనోహర్‌పై వైఎస్సార్‌ సీపీ నేత విద్యాసాగర్‌ ఫిర్యాదు చేశారు. దీంతోపాటు చిత్తూరు జిల్లా కుప్పం టౌన్‌ బ్యాంక్‌లో భారీ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. చంద్రబాబు పీఏ మనోహర్‌ ఈ గోల్‌మాల్‌ వ్యవహారంలో కీలక సూత్రధారి అని వైసీపీ ఆరోపిస్తోంది.

మనోహర్‌ సిఫారసుతో పలువురికి అడ్డగోలుగా లోన్లు మంజూరు చేసిన బ్యాంక్‌ ఇప్పుడు చిక్కుల్లో పడిందని చెబుతున్నారు. లోన్లు తీసుకున్న వారు చెల్లించకపోవడంతో బయటపడ్డ ఈ గోల్‌మాల్‌ వెనుక బడా నేతల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 2కోట్ల 97 లక్షల అవినీతి జరిగినట్టు ఓ అంచనా. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it