Telugu Gateway
Politics

డబ్ల్యూహెచ్ వోపై ట్రంప్ ఫైర్

డబ్ల్యూహెచ్ వోపై ట్రంప్ ఫైర్
X

అమెరికాలో 12907కు చేరిన కరోనా మృతులు

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణ మృదంగం ఆగటం లేదు. ఇఫ్పటి వరకూ ఆ దేశంలో ఏప్రిల్ 8 ఉదయం ఒకటిన్నర వరకూ 3,99,886 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య ఇదే సమయానికి 12,907 గా నమోదు అయ్యాయి. న్యూయార్క్ లో కరోనా కేసుల సంఖ్య 1,40,386 గా ఉంది. తర్వాత స్థానంలో న్యూజెర్సీ 44,416 ఉంటే, మిచిగాన్ లో 18,970 కేసులు ఉన్నాయి. అమెరికాలో అతి తక్కువ కేసులు ఉన్న ప్రాంతంగా కొలరాడో ఉంది. అక్కడ 5429 కేసులు మాత్రమే ఉన్నాయి. మంగళవారం ఒక్క రోజే అమెరికాలో ఏకంగా 1900 మరణాలు సంభవించాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇంత కాలం అయినా కూడా అమెరికాలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పరిస్థితులు గతంలో ఉన్నంత విషమంగా లేవన్నారు. అయితే అమెరికాలో మరణాలు ఆశించిన స్థాయి కంటే తక్కువ ఉంటాయని ప్రకటించి ప్రజలకు ఒకింత ఊరటనిచ్చారు.

ఒక్క న్యూయార్క్ లోనే 5400 మంది మృత్యువాత పడ్డారు. హైడ్రోక్లోరోక్వీన్ మందుల ఎగుమతులపై నిషేధం విధించారని భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్..తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో)పై మండిపడ్డారు. అంతే కాదు డబ్ల్యూహెచ్ వోకు ఇవ్వాల్సిన నిధులను ఆపేశారు. చైనాకు ఈ సంస్థ అనుకూలంగా పనిచేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. వైరస్ వచ్చిన తొలి రోజుల్లోనే డబ్ల్యూహెచ్ వో వద్ద పూర్తి సమాచారం ఉన్నా కూడా అమెరికాను సరైన రీతిలో అప్రమత్తం చేయటంలో ఈ సంస్థ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. కోవిడ్ 19 చైనాలో పెద్ద ఎత్తున విస్తరిస్తున్న సమయంలో అమెరికా ఆ దేశ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తే డబ్ల్యూహెచ్ వో వ్యతిరేకించిందని..ఇదే పెద్ద పొరపాటు అన్నారు.

Next Story
Share it