ఏపీలో కొత్తగా రెండు కరోనా కేసులు

ఏపీలో గత 24 గంటల్లో 892 కరోనా పరీక్షలు నిర్వహించగా..అందులో మొత్తం 17 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అయితే గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ కేవలం రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసులతో ఈ సంఖ్య 365కి పెరిగింది. రాష్ట్రంలో నమోదు అయిన 365 పాజిటివ్ కేసులకు గాను పది మంది డిశ్చార్జ్ట్ అయితే...ఆరుగురు మరణించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 349 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం 15
చిత్తూరు 20
తూర్పు గోదావరి 12
గుంటూరు 51
కడప 29
కృష్ణా 35
కర్నూలు 75
నెల్లూరు 48
ప్రకాశం 38
శ్రీకాకుళం 0
విశాఖపట్నం 20
విజయనగరం 0
పశ్చిమ గోదావరి 22