Telugu Gateway
Cinema

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి
X

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ బుధవారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ముంబయ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. లండన్ లో కూడా ఆయన కొంత కాలం చికిత్స పొందారు. మంగళవారం నాడు ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.

ఇర్ఫాన్ ఖాన్ నటించిన పీకూ సినిమాకు దర్శకత్వం వహించిన సూజిత్ సిర్కార్ ఇర్ఫాన్ మృతిని ధృవీకరిస్తూ ట్వీట్ చేశారు. ఇర్ఫాన్ తల్లి గత శనివారం నాడే మరణించారు. లాక్ డౌన్ కారణంగా ఆయన అంత్యక్రియలు కూడా హాజరు కాలేకపోయారు. తల్లి మరణించిన రోజుల వ్యవధిలోనే ఆయన కూడా మరణించారు. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ఇర్ఫాన్ ఎంతో అవార్డులు కూడా అందుకున్నారు.

Next Story
Share it