ఏపీకి లక్ష ర్యాపిడ్ కరోనా కిట్స్

ఏపీలో కరోనా పరీక్షల ఫలితం వేగం మరింత పెరగనుంది. దీనికి కారణానికి రాష్ట్రానికి కొత్తగా లక్ష కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఏపీ కరోనా పరీక్షల విషయంలో దేశంలోనే నాలగవ స్థానంలో ఉందని సర్కారు చెబుతోంది. శుక్రవారం నాడు దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో ఈ కిట్లను తరలించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ టెస్ట్ కిట్లను ప్రారంభించారు. ఈ ర్యాపిడ్ కిట్ల ద్వారా కేవలం పది నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాన్ని గుర్తించవచ్చు.
కొత్తగా లక్ష ర్యాపిట్ కిట్లు రావడంతో ఆంధ్రప్రదేశ్ కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. ఇన్‌ఫెక్షన్ ఉందా లేదా నిర్ధారించడమే కాకుండా.. ఇన్‌ఫెక్షన్ వచ్చి తగ్గినా సరే ఈ కిట్లు గుర్తించున్నాయి. నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కిట్లను పంపించనున్నట్టు తెలిపారు. మరోవైపు కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.