ఏపీలో కొత్తగా 14 కేసులు..మొత్తం 266
BY Telugu Gateway6 April 2020 6:26 AM

X
Telugu Gateway6 April 2020 6:26 AM
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నాడు కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 266కు పెరిగింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ జరిగిన కరోనా పరీక్షల్లో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా వచ్చిన కేసుల్లో విశాఖపట్నంలో ఐదు, అనంతపురంలో మూడు, కర్నూలులో మూడు, గుంటూరులో రెండు, పశ్చిమ గోదావరిలో ఒక కేసు నమోదు అయ్యాయి. ఏపీలో ఇఫ్పటివరకూ ఐదుగురు పేషంట్స్ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్చ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలోకర్నూలులోనే అత్యధికంగా 56 కేసులు నమోదు అయ్యాయి.
Next Story