Telugu Gateway
Andhra Pradesh

వెయ్యికు చేరువలో ఏపీ కరోనా కేసులు

వెయ్యికు చేరువలో ఏపీ కరోనా కేసులు
X

ఏపీలో కరోనా కేసులు వెయ్యికి చేరువ అవుతున్నాయి. గురువారం మొదటిసారి ఏకంగా 80 కేసులు రికార్డు అయ్యాయి. ఇదే ఇప్పటివరకూ ఏపీలో ఒక రోజు నమోదు అయిన అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు. శుక్రవారం కొత్తగా 62 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 955 చేరింది. కర్నూలులో కొత్తగా 27, కృష్ణాలో 14, గుంటూరు 11, అనంతపురం 4, ప్రకాశం 3 తూర్పుగోదావరి 2, నెల్లూరు 1 కేసు నమోదు అయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారు 29 మంది అయితే.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 145గా ఉంది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 781. గత 24 గంటల్లో రాష్ట్రంలో 6306 శాంపిళ్ళను పరీక్షించినట్లు ఏపీ సర్కారు హెల్త్ బులెటిన్ లో వెల్లిండించింది. రాష్ట్రంలో కొత్తగా నమోదు అయిన రెండు మరణాల్లో ఒకరు అనంతపురంలో, మరోకరు కర్నూలులో చనిపోయారని తెలిపారు.

Next Story
Share it