ఏపీలో కొత్తగా 21 కరోనా కేసులు..132కి చేరిన సంఖ్య
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. గురువారం ఉదయం పది గంటల నాటికి కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 132కి పెరిగింది. ఏపీలో మొత్తం 1800 శాంపిల్స్ ను పరీక్షించగా..అందులో 132 కేసుల్లో పాజిటివ్ గా ఫలితం వచ్చింది. 1175 ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. ఇంకా 493 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 226 మంది నుంచి, వారి కాంటాక్ట్స్ లో 130 మంది నుంచి శాంపిల్స్ ను పరీక్షలకు పంపారు.
ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 758 మంది నుంచి, ఢిల్లీ కాంటాక్ట్స్ లో 543 మంది శాంపిల్స్ ను పరీక్షలకు పంపారు. వీరు కాకుండా ఇతరులు 143 మంది ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే విదేశాల నుంచి వచ్చిన వారి కంటే ఢిల్లీ నుంచి వచ్చిన వారి వల్లే ఏపీలో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు అయిందనే విషయం అర్ధం అవుతోంది. ఈ వివరాలను స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.