Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో 603కు పెరిగిన కరోనా కేసులు

ఏపీలో 603కు పెరిగిన కరోనా కేసులు
X

ఏపీలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లోనే ఇవి వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 603కు పెరిగింది. ఇందులో 42 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 15 మంది మరణించారు. చికిత్స పొందుతున్న వారి సంఖ్య 546 మంది ఉన్నారు. కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లోనే కొత్తగా 18 కేసులు రాగా, కర్నూలులో ఐదు, తూర్పు గోదావరిలో రెండు, నెల్లూరులో మూడు, కర్నూలులో ఐదు, ప్రకాశంలో రెండు, పశ్చిమ గోదావరి ఒక కేసు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో 126 కేసులు ఉన్నాయి.

Next Story
Share it