Telugu Gateway
Cinema

వంద కోట్లు దాటిన ‘అల.. వైకుంఠపురములో’వ్యూస్

వంద కోట్లు దాటిన ‘అల.. వైకుంఠపురములో’వ్యూస్
X

అల్లు అర్జున్ సినిమా మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. అల..వైకుంఠపురములో సినిమాకు చెందిన పాటలు ఏకంగా వంద కోట్ల పదమూడు (1.13 బిలియన్ ) లక్షల వ్యూస్ సాధించాయి. ఈ పరిణామంపై అల్లు అర్జున్, సంగీత దర్శకుడు తమన్ లు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. శనివారం నాటికి అల వైకుంఠపురములో సినిమా పాటలు 1.13 బిలియన్ వ్యూస్ సాధించాయని తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో కీలక భూమిక ఆల్బమ్ దే అని చెప్పొచ్చు. పాటలే సినిమాపై అంచనాలను ఓ రేంజ్ కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

ఈ సినిమా పాటలు బిలియన్ వ్యూస్ దాటడంపై అల్లు అర్జున్ తాజాగా ట్వీట్ చేశారు. 'తమన్ నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. నువ్వు నాకిచ్చిన మాటను నిలబెట్టుకున్నావు. ఈ సినిమా పాటలు వంద కోట్ల వ్యూస్ రాబట్టాలని నిన్ను అడిగాను. 'తప్పుకుండా బ్రదర్.. నీకు మాటిస్తున్నా' అని చెప్పావు. ఈ రోజు 1.13 వంద కోట్ల వ్యూస్ వచ్చాయి. నీ మాటను నిలబెట్టుకున్నావు. ధన్యవాదాలు బ్రదర్' అని బన్నీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన తమన్.. 'ఈ ట్వీట్‌ను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను బ్రదర్' అని సమాధానం ఇచ్చారు. ఈ సినిమాలో ప్రతి పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Next Story
Share it