Telugu Gateway
Andhra Pradesh

నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖపై వైసీపీ ఫైర్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖపై  వైసీపీ ఫైర్
X

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు రక్షణ కల్పించాలంటూ కేంద్ర హోం శాఖకు రాసినట్లు చెబుతున్న లేఖపై అధికార వైసీపీ మండిపడింది. అసలు ఈ లేఖ రమేష్ కుమార్ రాశారా? లేదా అన్న విషయంపై ఆయన స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ లేఖ అంశంపై వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, పార్ధసారధి, జోగి రమేష్ లు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయటానికి నిమ్మగడ్డ లేఖ రాసినట్లు ఉందని ఆరోపించారు. ఇందులో వాస్తవాలపై దర్యాప్తు చేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. గురువారం నాడు తాము ఈ అంశంపై డీజీపీని కలవనున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న విషయాలనే ఈ లేఖలో రాసి కేంద్రానికి పంపిచినట్లుగా ఉందని ఆయన అన్నారు. అయితే తర్వాత తాను ఆ లేఖ రాయలేదని రమేష్ కుమార్ చెబుతున్నారంటూ వార్తలు వచ్చాయని ఆయన అన్నారు. అయితే ఆయన పేరుమీద హోం శాఖ కు లేఖ అందిందని ఆయన తెలిపారు. టిడిపి ఎందుకు ఇంత కుట్రలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నీచమైన ఎత్తగడలకు పాల్పడుతున్న చంద్రబాబు కు రమేష్ కుమార్ వత్తాసు పలుకుతున్నారని అన్నారు. రమేష్ కుమార్ తాను రాస్తే రాశానని , లేదంటే రాయలేదని అదికారికంగా ఆయన ప్రకటించాలని రాంబాబు డిమాండ్ చేశారు. నీతి, నిజాయతీ ఉంటే రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ పదవికి ఆయన ఏ మాత్రం అర్హుడు కాదన్నారు.

మూడు గంటలుగా ఐదు టీవీలు ఇదే ప్రచారం చేస్తున్నాయని ఆయన వివరించారు. ఈ లేఖ అంతా చంద్రబాబు కూర్చుని రాసినట్లుగా ఉందని ఆయన అన్నారు. ఇలాంటి నీచమైన కుట్రలు చేస్తున్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.తాము ఉన్నది ఉన్నట్లు మాట్లాడతామే తప్ప, కుట్రలకు పాల్పడబోమని ఆయన అన్నారు. రమేష్ కుమార్ రాసిన లేఖలో ఏకగ్రీవాల గురించి ప్రస్తావించారని..రాష్ట్రంలో 151 సీట్లు గెలిచిన తమకు ఏకగ్రీవాలు కాక ఎవరికి అవుతాయని ప్రశ్నించారు. టీడీపీ తరపున అభ్యర్ధులే లేరని వ్యాఖ్యానించారు. రమేష్ కుమార్ లేఖ పూర్తిగా కుట్రపూరితం అని పార్ధసారధి విమర్శించారు. తమ కార్యకర్తలను మోటివేట్ చేసేందుకు సీఎం పలు సూచనలు చేశారన్నారు. చంద్రబాబు కుట్రే ఇది అని జోగి రమేష్ ఆరోపించారు. ఈ లేఖ వెనక చంద్రబాబు అండ్ కో ఉందన్నారు. లేఖ అంశంపై రమేష్ కుమార్ స్పందించాలని డిమాండ్ చేశారు.

Next Story
Share it