టీడీపీకి మరో షాక్

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి షాక్ లు ఆగటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వరస పెట్టి రాజీనామాలు చేస్తుంటం టీడీపీకి ఇబ్బందికర పరిణామాంగా మారింది. బుధవారం నాడు విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ గా టీడీపీ వ్యతిరేకించటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని..విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వ్యతిరేకించటం సరికాదన్నారు.
అన్ని ప్రాంతాల అబివృద్ది కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తనను పార్టీ పరంగా కొందరు నేతలు ఇబ్బంది పెట్టారని ఆయన చెప్పారు. వికేంద్రీకరణ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలని పార్టీ కోరిందని, దానికి తాను అంగీకరించలేదని, ఉత్తరాంద్ర ప్రజల మనో భావాలు దెబ్బతినేలా టిడిపి వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. పార్టీకి రాజీనామా చేసి వ్యాపారం చేయాలని అనుకుంటున్నానని ఒక ప్రశ్నకు సమాదానంగా చెప్పారు.