‘ఫైటర్’ బైక్ ఫోటోలు లీక్
విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు బైక్ పై హల్ చల్ చేస్తున్న ఫోటోలు లీక్ అయ్యాయి. అంతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండేను హీరోయిన్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయ్ లో జరుగుతోంది. ఈ సినిమాకు చార్మి, కరణ్ జోహర్ లు నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. విజయ్ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే. ఈ సినిమాకు ‘ఫైటర్’ టైటిల్ ప్రచారంలో ఉంది.
చిత్ర యూనిట్ దీన్నే ఖరారు చేస్తుందా లేక ఏమైనా మార్పులు చేస్తుందా అన్నది వేచిచూడాల్సిందే. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ బ్యాంకాక్ వెళ్లి మరీ ప్రత్యేక శిక్షణ తీసుకొని వచ్చారు. ఆయన తాజాగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. అంతకు ముందు సినిమా డియర్ కామ్రెడ్ కూడా ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేదు. దీంతో విజయ్ ఇఫ్పుడు పూరీ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.