Telugu Gateway
Cinema

త్రివిక్రమ్ 20 లక్షలు..అనిల్ రావిపూడి 10 లక్షలు

త్రివిక్రమ్ 20 లక్షలు..అనిల్ రావిపూడి 10 లక్షలు
X

కరోనా వైరస్ పై పోరాటానికి టాలీవుడ్ కదిలివస్తోంది. ఒక్కొక్కరూ ఈ మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలంగాణ, ఏపీలకు చెరో పది లక్షల రూపాయల లెక్కన సాయం ప్రకటించారు. ఈ మొత్తాలను ఆయా ముఖ్యమంత్రుల సహాయ నిధికి అందజేయనున్నారు. త్వరలోనే ఈ మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేయనున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

త్రివిక్రమ్ తోపాటు మరో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందించారు. కరోనా పోరాటంలో భాగంగా తెలుగు రాష్ట్రాలు చేపట్టిన సహాయక చర్యలకు తన వంతుగా రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఆంధ్ర్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 5 లక్షల చొప్పున విరాళం అందజేయనున్నట్టు తెలిపారు. లాక్‌డౌన్‌ విజయవంతం చేయడానికి ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it